రానాకి శుభాకాంక్షలు తెలిపిన అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రానాకి శుభాకాంక్షలు తెలిపిన అనసూయ

  • 'బాహుబలి'తో రానాకి భారీ క్రేజ్
  • ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబుగా 
  • 'హిరణ్యకశిప'కి సన్నాహాలు
వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ తెలుగు .. తమిళ .. హిందీ భాషా చిత్రాలతో రానా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. 'బాహుబలి' వంటి భారీ చిత్రంలో నటించిన ఆయన, పౌరాణిక చిత్రమైన 'హిరణ్యకశిప' చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకి విషెస్ తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో యాంకర్ అనసూయ కూడా చేరిపోయింది.

"తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఎక్కువగా ఆలోచించే టాలీవుడ్ బిగ్ మ్యాన్ కి శుభాకాంక్షలు. తెలుగు సినిమా పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా గురింపు రావడం వెనుక రానా కృషి కూడా వుంది .. ఆయనకి మరింత శక్తి చేకూరాలి" అంటూ రానా పట్ల గల అభిమానాన్ని చాటుతూ ఆమె ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తుండగా, అనసూయ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనే సంగతి తెలిసిందే. 
raana
anasuya

More Telugu News