TRS: ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన కొత్త ఎమ్మెల్యేలు పట్నం, మైనంపల్లి

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావు విజయం సాధించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థులైన వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సమయానికే ఎమ్మెల్సీలుగా ఉన్నారు.

ఈ ఎన్నికల్లో వీరు విజయం సాధించడంతో తాజాగా తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కు తమ రాజీనామా పత్రాలను అందజేశారు. కాగా, రేవంత్ పై 9,319 ఓట్ల ఆధిక్యంతో పట్నం గెలిచారు. మల్కాజ్ గిరిలో బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావుపై మైనంపల్లి విజయం సాధించారు. 
Go Back to Shorts
TRS
new mla`s
patnam
mynampalli

More Telugu News