అఖిల్ కారణంగా ఆలోచనలో పడిన కల్యాణ్ రామ్
- జనవరి 25వ తేదీన వస్తోన్న అఖిల్
- రొమాంటిక్ లవ్ నేపథ్యంలో సాగే కథ
- అదే రోజున వద్దామనుకున్న కల్యాణ్ రామ్
తాజాగా అదే డేట్ ను ఖరారు చేసుకున్నారు. ఇదే రోజున '118' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి కల్యాణ్ రామ్ రెడీ అయ్యాడు. గుహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కొత్త ఏడాది ఆరంభంలోనే థియేటర్లలో సందడి చేయాలనుకున్నాడు. ఇప్పుడు అఖిల్ రంగంలోకి దిగుతుండటంతో, తన సినిమా విడుదల తేదీని కల్యాణ్ రామ్ వాయిదా వేసుకునే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. అటు అఖిల్ కే కాదు .. ఇటు తనకి కూడా హిట్ అవసరం కనుక ఆయన అలాంటి నిర్ణయం తీసుకోనున్నాడని చెప్పుకుంటున్నారు.