మరికాసేపట్లో లెక్కింపు ప్రారంభం.. 9 గంటలకే ఫలితాల సరళి
- 8 గంటలకు ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం
- కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
- నేడు విజయోత్సవాలకు అనుమతి నిరాకరణ
ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో 40 వేల మంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. 9 గంటలకల్లా పోలింగ్ సరళి ఏంటనేది తెలిసిపోనుంది. ఇక, శేరిలింగంపల్లిలో గరిష్టంగా 42 రౌండ్లు లెక్కించనుండగా, అతి తక్కువగా భద్రాచలం, అశ్వారావుపేటలలో 12 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లను నిషేధించిన ఈసీ, విజయోత్సవాలకు కూడా అనుమతి నిరాకరించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. అలాగే, సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు.