తొలిసారి ఓటేసి సంబరపడిన నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్!
- 'నిర్మలా కాన్వెంట్' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రోషన్
- శ్రీకాంత్, ఊహలతో కలసి వచ్చి ఓటేసిన రోషన్
- చాలా ఆనందంగా ఉందని వెల్లడి
'నిర్మలా కాన్వెంట్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రోషన్ వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు కాగా, నేడు జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ బూత్ నకు తల్లిదండ్రులతో కలసి వచ్చి ఓటు వేశాడు. ఆపై కెమెరాలకు తన వేలిపై ఉన్న ఇంక్ ను చూపుతూ పోజులిచ్చాడు. మొట్టమొదటిసారి ఓటు వేయడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా రోషన్ వ్యాఖ్యానించాడు.