ys jagan: పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు ద్రోహులని చంద్రబాబు అంటున్నారు!: వైఎస్ జగన్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలైతే, ఏదో సొంత రాష్ట్రంలో ఎన్నికల మాదిరిగా ఆ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తిరుగుతున్నారని, ఏపీలో ప్రజా సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు ద్రోహులని తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

 తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నదెవరని చంద్రబాబుని ప్రశ్నించారు. ఏపీలో ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి, పక్క రాష్ట్రంలోకెళ్లి ఏం జరగనట్టుగా ఈ పెద్దమనిషి మాట్లాడారని, అబద్ధాలు చెప్పడంతో ప్రపంచ రికార్డును చంద్రబాబు బద్దలు కొట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Go Back to Shorts
ys jagan
srikakulam
Chandrababu
Telangana

More Telugu News