ఇంటికే పరిమితమైన రేవంత్ రెడ్డి... ప్రస్తుతం కొడంగల్ పరిస్థితి ఇది!
- ముగిసిన ఎన్నికల ప్రచారం
- కొడంగల్ లో కేంద్ర బలగాల కవాతు
- ఇంట్లోనే ముఖ్యనేతలతో రేవంత్ సమావేశం
కొడంగల్ నియోజకవర్గంలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండటంతో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఈ ఉదయం పోలీసులు, కేంద్ర బలగాలు పట్టణంలో కవాతు నిర్వహించాయి. ప్రస్తుతం తన ఇంట్లో ఉన్న రేవంత్ రెడ్డి, తన అనుచరులు, ముఖ్య నేతలతో సమావేశమై, పోలింగ్ ఏర్పాట్లు, ఏజంట్ల వివరాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.