విక్రమ్ కుమార్ తో నాని .. షూటింగ్ డేట్ ఖరారు
- నాని 24వ సినిమాకి రంగం సిద్ధం
- మైత్రీ మూవీస్ పై నిర్మాణం
- ఫిబ్రవరి 19న షూటింగ్ మొదలు
నాని .. విక్రమ్ కుమార్ ఒక గోడపై కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా ఈ పోస్టర్ వుంది. ఫిబ్రవరి 19వ తేదీన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది తన కెరియర్లో డిఫరెంట్ మూవీ అవుతుందని నాని భావిస్తున్నాడు. విక్రమ్ కుమార్ ఈ కథపై గట్టి కసరత్తే చేశాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.