ఆంధ్రాలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలచేసిన మంత్రి గంటా!
- డిసెంబర్ 7తో ముగియనున్న దరఖాస్తు గడువు
- మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ పరీక్షల నిర్వహణ
- 91 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు
పరీక్షల నిర్వహణ కోసం 2,833 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. వీటిలో 91 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించామన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా భద్రతను పెంచడంతో పాటు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పరీక్షల నిర్వహణ పూర్తయ్యాక నెల రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపియింగ్ వంటి ఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.