చంద్రబాబు పేరెత్తవద్దంటే ఈ పని చేయండి: కేసీఆర్ కు బాలకృష్ణ సవాల్
Add ap7am to your home Screen

చంద్రబాబు పేరెత్తవద్దంటే ఈ పని చేయండి: కేసీఆర్ కు బాలకృష్ణ సవాల్

  • ఎయిర్ పోర్టును మూసివేయండి
  • హైటెక్ సిటీని కూల్చివేయండి
  • ఈ పనులు చేసే దమ్ముందా?
  • శేరిలింగంపల్లిలో బాలకృష్ణ
తెలంగాణలో చంద్రబాబునాయుడి పేరు వినిపించకుండా చేయాలంటే, శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలని, హైటెక్ సిటీని కూల్చి వేయాలని, ఫ్లయ్ ఓవర్లను తొలగించాలని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ పనులు చేసే దమ్ముందా? అంటూ కేసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు.

ఈ ఉదయం శేరిలింగంపల్లిలో రోడ్ షో నిర్వహిస్తూ పలు ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన బాలయ్య, టీఆర్ఎస్ కు చురకలు అంటించారు. పార్టీ మారిన నేతలంతా నమ్మక ద్రోహులేనని, వారందరినీ ఓడించి, మరొకరు ఇలా చేయకుండా బుద్ధి చెప్పాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. టీడీపీ గురించి కేసీఆర్‌ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని, తెలుగుదేశం పార్టీయే లేకుంటే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చేవారని బాలయ్య ధ్వజమెత్తారు.
Balakrishna
Serilingam palli
KCR

More Telugu News