అసలు రేవంత్ ఇంటికే పోలీసులు వెళ్లలేదు: ఏడీజీ జితేందర్
- రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు రాలేదు
- యూసఫ్ పై వచ్చినందునే సోదాలు
- అనుమానం వస్తే ప్రతిచోటా రైడింగ్
- వెల్లడించిన అడిషనల్ డీజీ జితేందర్
కొడంగల్ లో అధికార పార్టీ అభ్యర్థి అనుచరుల ఇళ్లలోనూ సోదాలు చేశామని గుర్తు చేశారు. కాగా, యూసఫ్ ఇంట్లో ఎంత డబ్బు దొరికిందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. నిన్న రాత్రి తన అనుచరుల ఇళ్లలో సోదాలు చేయడాన్ని నిరసిస్తూ, రేవంత్ రెడ్డి, ఆయన అభిమానులు, అనుచరులు ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.