టీడీపీ నేత సాధినేని యామినికి సోషల్ మీడియాలో వేధింపులు.. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!
- పవన్ పై విమర్ళలతో వెలుగులోకి వచ్చిన యామిని
- ఆమెను దూషిస్తూ పోస్టులు పెట్టిన నెల్లూరు యువకుడు
- అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకొచ్చిన పోలీసులు
నెల్లూరు పట్టణానికి చెందిన గంగినేని శ్రావణ్ కుమార్ ను గుంటూరు జిల్లా పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. కాగా, ఓ టీవీ ఛానల్ లో జరిగిన కార్యక్రమంలో తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన జనసేన నేత దిలీప్ సుంకరపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని యామిని అప్పట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.