అయ్యప్ప దగ్గరకు దాదాపు వెళ్లిన రెహానా... అరెస్టయిన మరుసటి రోజే ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగింపు!
- ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన బీఎస్ఎన్ఎల్
- గతంలో సన్నిధానం వరకూ వెళ్లిన రెహానా
- భక్తుల నిరసనలతో వెనక్కు
ఆపై ఆమె నీలక్కల్ కు చేరుకోగా, పోలీసుల భద్రత నడుమ ఆమెను సన్నిధానం వరకూ తీసుకెళ్లగలిగారు. భక్తుల నిరసనలతో ఆమె వెనుదిరిగి రాగా, ఆ తరువాత ఆమె మైల బట్టలు ఇరుముడిలో పెట్టుకు వచ్చిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె నివాసాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నాశనం చేశారు. రెహానాను ముస్లిం సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఆమె తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుంది. కాగా, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు శబరిమలకు అన్ని వయసుల మహిళలూ వెళ్లవచ్చని తీర్పిచ్చిన తరువాత, రుతుస్రావం వయసులో ఉన్న ఏ మహిళా స్వామిని దర్శించుకోలేదు.