jd lakshminaraya: జగన్ పై దాడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

షార్ట్స్‌లో చూడండి
నవ నిర్మాణ దీక్షలు, పుష్కరాల పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. లోక్ సత్తాతో పాటు పలు పార్టీలు తనను ఆహ్వానించాయని... తాను ఏ విధంగా ప్రజాజీవితంలోకి వస్తానో త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.

తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, తానే బాణాలు వదులుతానని అన్నారు. వైసీపీ అధినేత జగన్ పై దాడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం కాదని చెప్పారు. తమ పార్టీలో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని తెలిపారు. తమ విధానాలు నచ్చిన వారితో కలసి పని చేయడానికి సిద్ధమేనని చెప్పారు.
Go Back to Shorts
jd lakshminaraya
jagan
ysrcp

More Telugu News