మేడ్చల్ సభలో సోనియాకు ఘన సన్మానం... సోనియాకు వందనమంటూ వేదికపై పాట పాడిన గద్దర్
Add ap7am to your home Screen

మేడ్చల్ సభలో సోనియాకు ఘన సన్మానం... సోనియాకు వందనమంటూ వేదికపై పాట పాడిన గద్దర్

  • రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన సోనియా
  • ఘనంగా సన్మానించిన నేతలు
  • తెలంగాణ ఇచ్చిన సోనియాకు ధన్యవాదాలన్న గద్దర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తొలిసారి రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ సభలో ఆమెకు కాంగ్రెస్ నేతలు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధినేత కోదండరామ్, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు అభినందనలు తెలిపారు. సోనియాకు గద్దర్ సతీమణి చీరను బహూకరించారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ, తెలంగాణను ఇచ్చిన సోనియాతల్లికి వందనమని చెప్పారు. తెలంగాణ పసిబిడ్డకు పాలు పట్టకుండా టీఆర్ఎస్ పాలకులు జోలపాట పాడారని విమర్శించారు. తెలంగాణ పసిబిడ్డను తన ఒడిలోకి తీసుకొని దీవించడానికి సోనియాతల్లి వచ్చారని చెప్పారు. 'పొడుస్తున్న పొద్దుమీద.. నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా' అనే పాటను పాడారు. మరోవైపు, కాసేపట్లో రాహుల్ గాంధీ సభావేదిక వద్దకు చేరుకోనున్నారు.
Sonia Gandhi
congress
gaddar
Rahul Gandhi

More Telugu News