kcr: కేసీఆర్, కేటీఆర్ లకు పిచ్చిపట్టి రాష్ట్రమంతా తిరుగుతున్నారు: రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు పిచ్చిపట్టి రాష్ట్రమంతా తిరుగుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓడిపోయేవాళ్లకు మాటలు ఎక్కువని అన్నారు. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి కూడా టీఆర్ఎస్ ధర్మాన్ని నెరవేర్చుకోవచ్చని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ చెప్పారని... 99 సీట్లు మాత్రమే వచ్చాయని, మరి ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నా ఆపలేరని రేవంత్ చెప్పారు. మన కింద ఉన్న రాష్ట్రం మనకు నీళ్లను ఆపే పరిస్థితి ఉండదని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెబితే చంద్రబాబు అడ్డుపడ్డారా? అని ప్రశ్నించారు. 12 శాతం రిజర్వేషన్లను చంద్రబాబు అడ్డుకున్నారా? అని అడిగారు. టీఆర్ఎస్ ఎంపీలే కాకుండా ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నారని... చేతనైతే ఆపుకోవాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు.
Go Back to Shorts
kcr
KTR
Revanth Reddy
Chandrababu
TRS
congress
Telugudesam

More Telugu News