శబరిమలలో చిక్కుకున్న 40 మంది తెలుగువాళ్లు.. అన్నం, నీళ్లు దొరక్క తీవ్ర ఇక్కట్లు!
- రేపు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం
- 144 సెక్షన్ విధించిన కేరళ ప్రభుత్వం
- నీలక్కల్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఓ భక్తుడు మాట్లాడుతూ.. సన్నిధానానికి వెళ్లే మార్గంలోనే బస్సులను పోలీసులు నిలిపివేశారని తెలిపారు. దాదాపు 40 మంది తెలుగువారు ఇక్కడ చిక్కుకున్నారని చెప్పారు. రేపు మధ్యాహ్నం దాకా తమను అనుమతించబోమని అధికారులు చెబుతున్నారని వాపోయారు. తాము ఎలాంటి ఆహారం, నీళ్లను వెంట తెచ్చుకోలేదన్నారు. బస్సులు ఆగిపోయిన ప్రాంతంలో ఆహారం, మంచినీటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి బాగోలేదనీ, భక్తులెవరూ ఇప్పుడే రావొద్దని సూచించారు