తమిళనాడు తీరం దిశగా దూసుకొస్తున్న ‘గజ’ తుపాను.. అప్రమత్తమైన నావికా దళం
- నేటి సాయంత్రం కడలూరు వద్ద తీరం దాటనున్న తుపాను
- యుద్ధ నౌకలు, హెలికాప్టర్లతో సిద్ధంగా ఉన్న నావికాదళం
- అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
కాగా, బుధవారం సాయంత్రానికి చెన్నైకి 430 కిలోమీటర్లు, నాగపట్నానికి 510 కిలోమీటర్ల దూరంలో నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణించి తీవ్ర తుపానుగా మారుతుంది. ఆ తర్వాత బలహీనపడి తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ఏపీలోని కోస్తా వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.