డొక్కు స్కూటర్‌పై వచ్చేవారు.. ఆదరించి టికెట్ ఇస్తే వెన్నుపోటు పొడిచారు: మాజీ ఎమ్మెల్యే కన్నబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్
- పోనీ కదా అని ఆదరిస్తే ద్రోహం చేశారు
- ఎమ్మెల్యేగా కోట్లు సంపాదించారు
- టీడీపీపై పోరాటాన్ని ఎంచుకున్నది అందుకే..
ప్రజాసేవ కోసం సినిమాలను, కుటుంబాన్ని వదలుకుని రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ పునరుద్ఘాటించారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివద్ధి చెందుతుందని భావించే గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. అయితే, టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడంతోనే పోరాటబాట ఎంచుకున్నట్టు పవన్ స్పష్టం చేశారు.