‘వినయ విధేయ రామ’ టీజర్ తెచ్చిన తంటా!
- ఎన్నో సినిమాల్లో హీరోగా మెప్పించిన ప్రశాంత్
- చెర్రీ వెనుక రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు
- సోషల్ మీడియాలో నిరసిస్తూ పోస్టులు
ఆయన ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించారు. జీన్స్ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌తో కలిసి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి హీరో.. ‘వినయ విధేయ రామ’ టీజర్‌లో రామ్ చరణ్ ముందు నడుస్తుండగా వెనుక వస్తున్న నలుగురిలో ఒకరు కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రశాంత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.