28 ఓట్ల తేడాతో ఓడిపోయా.. ఆ బాధేంటో నాకు తెలుసు!: వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
- జగన్ పాదయాత్రతో టీడీపీ నేతల్లో భయం
- నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
- వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం
వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రఘురామిరెడ్డి సూచించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ ఓట్లు దక్కేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ సొంత మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కారణంగా అభివృద్ధిలో మైదుకూరు వెనుకపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.