venkatesh: దీపావళి కానుకగా 'ఎఫ్ 2' నుంచి ఫస్టులుక్ వచ్చేసింది!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు యువ దర్శకులలో వరుస విజయాలను దక్కించుకుంటూ అనిల్ రావిపూడి తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. 'పటాస్' .. 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' ఆయన దర్శక ప్రతిభకు అద్దం పడతాయి. ఆయన తాజా చిత్రంగా 'ఎఫ్ 2' రూపొందుతోంది. పూర్తి వినోదప్రధానమైన ఈ కథా వస్తువు మల్టీస్టారర్ గా నిర్మితమవుతోంది.

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో, వెంకీ సరసన తమన్నా .. వరుణ్ జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. దీపావళి పండగకి తగినట్టుగానే మంచి కలర్ ఫుల్ గా ఈ పోస్టర్ ను వదిలారు .. ఈ పోస్టర్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.     
Go Back to Shorts
venkatesh
varun tej

More Telugu News