అతన్ని పుట్టించిన దేవుడికి ధన్యవాదాలు: అనుష్కశర్మ

  • నేడు కోహ్లీ 30వ జన్మదినోత్సవం
  • శుభాకాంక్షలు చెప్పిన అనుష్క శర్మ
  • పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు కూడా
నేడు తన 30వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రకాల ఫార్మాట్లలో రాణిస్తూ, ఒక్కో రికార్డునూ బద్దలుకొడుతూ సాగుతున్న కోహ్లీకి, ఆయన భార్య, నటి అనుష్క శర్మ కూడా ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. అతన్ని పుట్టించిన దేవుడికి కృతజ్ఞతలని చెప్పింది. విరాట్ తో కలిసున్న రెండు చిత్రాలను ఫ్యాన్స్ తో పంచుకుంది.

ఇక మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతూ, నేడు ధన్ తేరస్ (ధన త్రయోదశి) అని గుర్తు చేశాడు. ఈ సంవత్సరం మొత్తం నీకు రన్ తేరస్ కావాలని ఆశిస్తున్నానని చెప్పాడు. ఆటగాళ్లు ధోనీ, జడేజా, బుమ్రాలు కోహ్లీకి శుభాక్షాంక్షలు చెబుతున్న వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్, వృద్ధిమాన్ సాహా, షమీ తదితరులు కోహ్లీకి శుభాకాంక్షలు చెప్పారు.
Go Back to Shorts
Virat Kohli
Twitter
Anushka Sharma
Birthday

More Telugu News