ఇప్పటివరకూ శబరిమల వెళ్తామని ఏ యువతీ చెప్పలేదు: కేరళ పోలీసులు
- నేడు తెరచుకోనున్న ఆలయం
- భద్రత కల్పించాలని ఎవరూ అడగలేదు
- భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్న పోలీసులు
కాగా, నేడు పంబలో దాదాపు 5 వేల మంది భక్తులతో ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ అనుబంధ హిందూ పరిరక్షణ సమితి నిర్ణయించడంతో, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, ఈ ర్యాలీకి అనుమతి లేదని, అడ్డుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. భద్రత కల్పిస్తున్న పోలీసుల్లో 100 మంది మహిళా సిబ్బంది, 20 మంది కమాండోలు ఉన్నారని చెప్పారు.