విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని
- బన్నీతో అనుకున్న సినిమా వాయిదా
- నానికి కథ వినిపించిన విక్రమ్ కుమార్
- త్వరలోనే షూటింగుకు ఏర్పాట్లు
గతంలోనే ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు .. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. బన్నీతో చేయవలసిన ప్రాజెక్టు వాయిదా పడటంతో, అంతకు ముందు నానితో అనుకున్న సినిమా చేయడానికి విక్రమ్ కుమార్ రెడీ అవుతున్నాడు. అశ్వనీదత్ బ్యానర్లో ఈ సినిమా ఉండొచ్చుననే టాక్ వినిపిస్తోంది. ఇక సుకుమార్ కి కూడా నాని ఓకే చెప్పాడనే వార్త వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ సినిమా తరువాత ఆ ప్రాజెక్టు ఉండొచ్చని తెలుస్తోంది.