‘డ్యాన్సింగ్ అంకుల్’పై దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం.. ఓటు హక్కు వినియోగంపై వీడియోలు
- డ్యాన్సింగ్ అంకుల్‌తో వీడియో రూపొందించిన ఎన్నికల అధికారులు
- పలు జిల్లాల నుంచి పిలుపు
- ఓటు హక్కుపై అవగాహన వీడియోల రూపకల్పన
సంజీవ్ శ్రీవాస్తవపై ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారులు దృష్టిసారించారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆయనను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా శ్రీవాస్తవతో కలిసి ఓ ప్రచార వీడియోను రూపొందించారు. ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఆ వీడియో ద్వారా ఆయన ఓటర్లకు పిలుపునిస్తున్నారు. విషయం తెలిసిన విదిశా జిల్లా అధికారులు కూడా ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.