మహేశ్ .. రవితేజ సినిమాల విషయంలో క్లారిటీ వచ్చేసింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ .. రవితేజ సినిమాల విషయంలో క్లారిటీ వచ్చేసింది

  • సుకుమార్ - మహేశ్ కథ ఇంకా సెట్ కాలేదు 
  • రవితేజ్ తో 'తెరి' రీమేక్ వుంది 
  • లో బడ్జెట్ తో ఓ సినిమా చేయనున్నాం
కథాబలం కలిగిన వైవిధ్యభరితమైన చిత్రాలను చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ బ్యానర్ నుంచి మహేశ్ బాబు - సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా ఉందనీ, రవితేజ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా ఉందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆ విషయంలో మైత్రీమూవీ మేకర్స్ వారు క్లారిటీ ఇచ్చారు."మహేశ్ - సుకుమార్ కాంబినేషన్లో సినిమా చేయాలనే అనుకున్నాం .. కానీ ఇంతవరకూ కథ సెట్ కాలేదు. ఆ ఇద్దరూ మంచి కథ సెట్ చేసుకుని ఓకే అంటే మా బ్యానర్లో చేయడానికి మేం సిద్ధంగా వున్నాము" అని అన్నారు. "ఇక సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజతో ఒక సినిమా చేయనున్నమాట నిజమే. ఇది తమిళంలో హిట్ అయిన 'తెరి'కి రీమేక్. నిజానికి ఈ సినిమాను పవన్ తో చేయవలసింది .. కానీ ఆయన చేయనన్నారు. దాంతో ఆ కథను రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్చి చేయనున్నాము. అంతేకాదు కోటి రూపాయల లోపు బడ్జెట్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేశాము. ఈ సినిమా ద్వారా రితేష్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతాడు" అని చెప్పుకొచ్చారు.    
Mahesh Babu
raviteja

More Telugu News