సినిమాలే లేని శివాజీని లోపలేసి మక్కెలిరగ కొడితే...!: రోజా నిప్పులు

  • శివాజీ నోటి నుంచి 'ఆపరేషన్ గరుడ' వివరాలు రాబట్టండి
  • సినిమాలు లేని శివాజీని ముందు పెట్టుకుని చంద్రబాబు డ్రామాలు
  • వెనకనుంచి నడిపిస్తున్నది చంద్రబాబేనన్న రోజా
ఒక్క సినిమా అవకాశం కూడా లేకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న శివాజీని ముందు పెట్టుకుని చంద్రబాబు 'ఆపరేషన్ గరుడ' అంటూ కొత్త నాటకాన్ని ప్రారంభించారని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. జగన్ పై దాడి జరిగిన తరువాత గంట వ్యవధిలోనే నిందితుడు, జగన్ కలిసున్నారంటూ చూపించేలా మార్ఫింగ్ చేసిన ఫొటోలను మీడియాకు చూపించారని గుర్తు చేసిన ఆమె, జగన్ అభిమాని అయితే, వెనుక వైఎస్, విజయమ్మల చిత్రాలు ఉంటాయని, అదే విధంగా ప్లెక్సీని ముద్రించిన స్టూడియో పేరు తప్పనిసరిగా ఉంటుందని, అవేమీ ఇందులో లేవని అన్నారు.

కొత్త నాటకానికి తెరలేపిన చంద్రబాబు, అడ్రస్ లేని శివాజీతో కలసి డ్రామా ఆడుతున్నారని, ఆయనేదో కాలజ్ఞానిలాగా చెప్పారంటూ, దాన్ని ఇప్పుడు నమ్ముతున్నానంటూ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ముందుగానే ఒక స్క్రిప్టు రాయించి, దాన్ని శివాజీతో చెప్పించి, వెనుకనుంచి నడిపిస్తున్నది చంద్రబాబా? లోకేషా అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శివాజీని లోపలేసి మక్కెలిరగ కొడితే, అసలు నిజాలన్నీ బయటకు వస్తాయని ప్రతి ఒక్కరూ అంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. 'ఆపరేషన్ గరుడ' ఎవరు నడిపిస్తున్నారు? దాని సూత్రధారులు ఎవరు? వంటి విషయాలన్నీ శివాజీ నోటి నుంచి చెప్పించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Roja
Chandrababu
Sivaji
Operation Garuda

More Telugu News