ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్టు చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. సెన్సాఫ్ హ్యూమర్‌కు నెటిజన్ల ఫిదా
- తనకు పూజించే హక్కు ఉందన్న స్మృతి
- మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్ల గరం
- ఫొటోతో అందరి నోళ్లూ కట్టిపడేసిన మంత్రి
మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన స్మృతి.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పోస్టు చేశారు. కుర్చీలో కూర్చున్న ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నోరు కూడా మూసేశారు. గతంలో ఆమె నటించిన ‘క్యూంకీ సాస్ భీ కభి బహూ థీ’ అనే సీరియల్‌లోనిది ఈ ఫొటో. దీనికింద ఆమె తానేదైనా మాట్లాడితే ఎప్పుడూ వాగుతూనే ఉంటానని అంటారని క్యాప్షన్ రాశారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌కు ఫిదా అవుతున్నారు. ఒక్క ఫొటోతో తానేం చెప్పాలనుకున్నారో దానిని స్పష్టంగా చెప్పారని ప్రశంసిస్తున్నారు.