జగన్ పై సానుభూతి రావడం కోసమే దాడి చేశానన్న నిందితుడు?
- శ్రీనివాస్ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు
- జగన్ సీఎం కాకపోవడంతో నిందితుడు మనస్తాపం
- దాడి చేస్తే జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించాడట
గత ఎన్నికల్లోనే జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వాల్సిందని, అలా కాకపోవడం వల్ల తాను మనస్తాపం చెందానని, దాడి చేస్తే ఆయనపై సానుభూతి పెరుగుతుందని భావించే అలా చేశానని శ్రీనివాస్ తెలిపినట్టు సమాచారం. తమ కుటుంబమంతా వైఎస్ అభిమానులమేనని శ్రీనివాస్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.