అల్లు అర్జున్ తోనే చేయాలనే పట్టుదలతో విక్రమ్ కుమార్
- కథపై కసరత్తు చేస్తోన్న విక్రమ్ కుమార్
- త్వరలో బన్నీని ఒప్పించే ప్రయత్నం
- ఆ తరువాత లింగుస్వామితో బన్నీ ప్రాజెక్టు
కానీ విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా తప్పకుండా వుంటుందనేది తాజా సమాచారం. అల్లు అర్జున్ .. విక్రమ్ కుమార్ కి ఫోన్ చేసి, సెకండాఫ్ ఎంతవరకూ వచ్చిందని తరచూ అడుగుతూనే ఉన్నాడట. అందువలన తమ కాంబినేషన్లో సినిమా తప్పక ఉంటుందని సన్నిహితులతో విక్రమ్ కుమార్ చెబుతున్నట్టుగా సమాచారం. అదే నిజమైతే త్రివిక్రమ్ తరువాత సినిమాను విక్రమ్ కుమార్ తో చేసి, ఆ తరువాత ప్రాజెక్టును లింగుస్వామితో అల్లు అర్జున్ చేయవచ్చని చెప్పుకుంటున్నారు.