మళ్లీ 40 ఏళ్ల తరువాత వస్తా... అయ్యప్ప సన్నిధిలో భక్తులను ఆకర్షించిన బాలిక!

  • ప్లకార్డును ప్రదర్శించిన తొమ్మిదేళ్ల బాలిక జనని
  • తండ్రితో కలసి సన్నిధానానికి వచ్చి స్వామిని దర్శించుకున్న బాలిక
  • ఆలయానికి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న సంప్రదాయవాదులు
"స్వామియే శరణం అయ్యప్ప... నా పేరు జనని. నాకిప్పుడు తొమ్మిదేళ్లు. నేను మళ్లీ శబరిమల సన్నిధానానికి 40 సంవత్సరాల తరువాత, నాకు 50 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వస్తాను" అని రాసున్న ఓ ప్లకార్డును పట్టుకున్న బాలిక, శబరిమలకు వచ్చిన భక్తులను విశేషంగా ఆకర్షించింది. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ఆలయంలో ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పివ్వగా, అందుకు హిందూ సంఘాలు, సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తండ్రి, బంధువులతో కలసి సన్నిధానానికి వచ్చి స్వామిని దర్శించుకున్న జనని, ఇలా ప్లకార్డు పట్టుకుని నిలబడింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Sabarimala
Ayyappa
Janani
Kerala

More Telugu News