తిత్లీ తుపాను ఎఫెక్ట్.. శ్రీకాకుళంలో కూలిన సముద్ర వంతెన
- గత కొన్నేళ్లుగా శిథిలావస్థలోనే వంతెన
- తుపాను గాలులకు కుప్పకూలిన వైనం
- శ్రీకాకుళంలోనే ముఖ్యమంత్రి, మంత్రులు
కాగా, జిల్లాలో తుపాను ప్రభావం పలు చోట్ల ఇంకా కనిపిస్తూనే ఉంది. తుపాను సందర్భంగా వీచిన బలమైన గాలుల ప్రభావం ఇప్పుడు చూపిస్తోంది. జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఒకటైన మొగదలపాడులో ఉన్న సముద్ర వంతెన గాలుల ధాటికి కుప్పకూలింది. గత కొన్నేళ్లుగా ఇది శిథిలావస్థలోనే ఉన్నప్పటికీ తాజాగా వీచిన తుపాను గాలులకు బుధవారం కుప్పకూలింది.