మావోయిస్టు మీనాను పోలీసులు కాల్చి చంపారు: అమర వీరుల బంధుమిత్రుల సంఘం
- ఎదురు కాల్పుల ఘటన ఒట్టి బూటకం
- ఈనెల 11న మీనాను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారు
- లొంగక పోవడంతో కాల్చిచంపేసి ఎన్‌కౌంటర్ కథ అల్లారు
అయితే, దీన్ని బూటకపు ఎన్‌కౌంటర్‌గా బంధుమిత్రుల సంఘం, విరసం నేతలు కొట్టిపారేశారు. వరంగల్ జిల్లాలోని పొచ్చన్నపేటలో మీనాకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకుని కూంబింగ్ చేపట్టిన పోలీసులు మీనాను హత్య చేశారన్నారు. కాగా, మల్కన్ గిరి పోలీసుల అదుపులో ఉన్న మరో నలుగురు మావోయిస్టులను కోర్టుకు తరలించినట్లు ఎస్పీ జోగ్గా మోహన్ తెలిపారు.