తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పల్సర్ బైక్ పై తిరిగిన నారా లోకేష్
- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను వణికించిన తిత్లీ తుపాను
- ఉద్ధానం ప్రాంతాన్ని పరిశీలించిన నారా లోకేష్
- బాధితుల్లో భరోసాను నింపే ప్రయత్నం చేసిన వైనం
మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఉద్ధానం ప్రాంతంలో ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలసి పల్సర్ బైక్ పై తిరుగుతూ పరిశీలించారు. మధ్యమధ్యలో బాధితులను కలుస్తూ, వారికి భరోసాను కల్పిస్తూ ముందుకుసాగారు.