బాలకృష్ణను చూస్తుంటే అచ్చం ఎన్టీఆర్ ను చూస్తున్నట్టే ఉంది: టీటీడీపీ నేతల ప్రశంసలు
Add ap7am to your home Screen

బాలకృష్ణను చూస్తుంటే అచ్చం ఎన్టీఆర్ ను చూస్తున్నట్టే ఉంది: టీటీడీపీ నేతల ప్రశంసలు

  • బాలయ్య నటిస్తుంటే ఎన్టీఆర్ నటిస్తున్నట్టే ఉంది
  • సినిమా షూటింగ్ చూడటానికే ఇక్కడకు వచ్చాం
  • బాలయ్యతో రాజకీయాలు మాట్లాడలేదు
దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్ 'ఎన్టీఆర్' చరిత్రలో నిలిచిపోతుందని టీటీడీపీ నేతలు ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు అన్నారు. ఈరోజు వారు హైదరాబాదులోని సారథి స్టూడియోస్ కు వెళ్లి బాలయ్యతో గంట సేపు చర్చలు జరిపారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, కేవలం సినిమా షూటింగ్ ను చూడటానికే తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. రాజకీయాలపై బాలయ్యతో మాట్లాడలేదని చెప్పారు. బాలయ్యను చూస్తుంటే అచ్చం ఎన్టీఆర్ ను చూసినట్టే ఉందని అన్నారు. బాలయ్య నటిస్తుంటే ఎన్టీఆరే నటిస్తున్నట్టు అనిపిస్తోందని చెప్పారు. 'ఎన్టీఆర్' అండదండలతో రానున్న ఎన్నికల్లో విజయభేరి మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Balakrishna
l ramana
peddireddy
ravula
ntr
tollywood
tTelugudesam

More Telugu News