ys jagan: ఇది ఈ దశాబ్దపు జోక్ గా మిగిలిపోతుంది: జగన్ పై గంటా సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గంటా శ్రీనివాసరావు సెటైర్ వేశారు. రాజకీయాల్లో విలువల గురించి జగన్ మాట్లాడటం ఈ దశాబ్దపు జోక్ గా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో నికార్సైన వ్యక్తి చంద్రబాబు అని, అటువంటి వ్యక్తి గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. జగన్ మూడు వేల కిలోమీటర్లు కాదు కదా, ముప్పై వేల కిలోమీటర్లు నడిచినా ఎటువంటి ఉపయోగం ఉండదని విమర్శించారు. వైసీపీ మునిగిపోయే పడవ లాంటిదని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. 
Go Back to Shorts
ys jagan
ganta

More Telugu News