భార్యలు బతికి ఉండగానే 100 మందికి పిండ ప్రదానం.. వాస్తవ్ ఫౌండేషన్ నిర్వాకం!

  • భార్య బాధితులకు అండగా వాస్తవ్ ఫౌండేషన్
  • గోదావరిలో భార్యలకు పిండ ప్రదానం చేసిన భర్తలు
  • వేద మంత్రోచ్చారణ మధ్య కార్యక్రమం
భార్యలు బతికి ఉండగానే భర్తలు పిండ ప్రదానం చేసిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో సంచలనమైంది. వాస్తవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందమంది భర్తలు వేదమంత్రోచ్చారణ మధ్య గోదావరిలో తర్పణాలు విడిచారు. భర్తలకు భార్యలు విముక్తి కల్పిస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వాస్తవ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అమిత్ దేశ్‌పాండే తెలిపారు.

పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయని, చివరికి అవి విడాకులకు దారి తీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వ్యవహారాల్లో మహిళలకే ఎక్కువగా మద్దతు లభిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో భర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే వాస్తవ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్టు అమిత్ తెలిపారు. గతంలో వారణాసిలోనూ పిండ ప్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అమిత్ వివరించారు.
Go Back to Shorts
Vastv foundation
Nasik
Godavari
Husbunds
Wives
Maharashtra

More Telugu News