nakka anandababu: కేసీఆర్! నీలాంటి నీచుడు రాజకీయాల్లో ఉండడు.. నీకు సిగ్గు ఉందా?: మంత్రి నక్కా ఆనందబాబు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం సోనియాగాంధీ కాళ్లు నాకారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'పోటుగాడు తన్నుకోవడానికి వస్తాడా? రమ్మనండి చూసుకుందాం' అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండరని అన్నారు. కేసీఆర్ నీకు సిగ్గు ఉందా? అని అన్నారు.

తెలంగాణ యువతను ఊచకోత కోశారంటున్న కేసీఆర్... 2009లో చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ఆనందబాబు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. కేసీఆర్ చేసినవన్నీ దొంగ దీక్షలే అని ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ రోడ్లను చూసి కూడా సిగ్గుపడే పరిస్థితి ఉందని చెప్పారు. హైదరాబాద్ కేసీఆర్ అబ్బ సొత్తు కాదని... పదేళ్ల పాటు నగరంపై ఏపీకి కూడా హక్కు ఉందని తెలిపారు.

సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయించడం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు అలవాటేనని ఆనందబాబు అన్నారు. లక్ష కోట్ల రాఫెల్ స్కాంపై దాడులు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. తాము తప్పు చేయలేదని... ఎవరికీ భయపడమని చెప్పారు. 
Go Back to Shorts
nakka anandababu
Chandrababu
kcr
Sonia Gandhi

More Telugu News