తెరపైకి వచ్చిన మరో పాత కేసు... కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుపై కదిలిన పోలీసులు!
- టీఆర్ఎస్ నేతను గంజాయి కేసులో ఇరికించే ప్రయత్నం
- శ్రీధర్ బాబుపై హైదరాబాద్ లో నమోదైన కేసు
- స్వర నివేదిక ఇవ్వాలని కోరిన పోలీసులు
పెద్దపల్లి జిల్లా ఓడేడుకు చెందిన కిషన్ రెడ్డి అనే తెలంగాణ రాష్ట్ర సమితి నేతను గంజాయి కేసులో ఇరికించాలంటూ, సుదర్శన్ కోరుతుండగా, అందుకు ప్లాన్ చేద్దామంటూ శ్రీధర్ బాబు వ్యాఖ్యానించిన ఆడియో సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అయింది. అయితే, ఈ ఆడియోలో వినిపిస్తున్న గొంతు శ్రీధర్ బాబుదేనా? అన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు. ఇప్పుడు తాజాగా, ఈ విషయమై హైదరాబాద్ పోలీసులు మరోసారి రిపోర్టు కోరడంతో ఎన్నికల వేళ మరో పాతకేసు తెరపైకి వచ్చినట్లయింది.