Madhya Pradesh: మహిళ కోరికను తీర్చలేదన్న కోపంతో ఆమె కుమార్తెపై అత్యాచారం!

షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెస్తున్నా, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తన కోరికను తీర్చడానికి ఓ మహిళ నిరాకరించడంతో ఓ మానవ మృగం రెచ్చిపోయింది. తల్లిపై పగతో ఆమె కుమార్తెను చెరపట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది.

ఇండోర్ లో ఉంటున్న బాధితురాలిని ఆమెకు సమీప బంధువైన ఓ వ్యక్తి తన కోరికను తీర్చాల్సిందిగా వేధించసాగాడు. అయితే సదరు మహిళ ఇందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో నిందితుడు నిన్న ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఆ మహిళ ఇంట్లో లేకపోవడంతో ఏడాది వయసున్న ఆమె పసికందుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అదేరోజు రాత్రి మరోసారి ఇంటికి వచ్చి పెద్ద కుమార్తె(4)పై అత్యాచారానికి యత్నించాడు.

దీంతో తల్లి ఫిర్యాదుతో సదరు రాక్షసుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ లోని రెహ్లీలో ఈ ఏడాది మేలో ఓ బాలిక(9)పై అత్యాచారం చేసిన వ్యక్తికి ఓ కోర్టు కేవలం 46 రోజుల్లో మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Madhya Pradesh
rape
Police
indore

More Telugu News