ఆ అమ్మాయి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తోంది: నానాపటేకర్
- సెట్ లో నాతో పాటు మరో వంద మంది ఉన్నారు
- చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నా
- నేనేమి మాట్లాడినా మీడియా ఏవేవో రాసేస్తుంది!
కాగా, 2009లో వచ్చిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్ లో నానాపటేకర్ తనపై అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా ఆరోపించింది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన గణేశ్ ఆచార్య స్పందిస్తూ, నానా పటేకర్ పై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ సెట్ లో తాను కూడా ఉన్నానని, నానా పటేకర్ ఇచ్చిన సలహాలను తనుశ్రీ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై తనుశ్రీ దత్తా స్పందిస్తూ, అతను పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడింది.