రాజీనామా చేస్తారా? చస్తారా?... ఉగ్రవాదుల ట్వీట్ తో నాలుగు రోజుల్లోనే 40 మంది పోలీసుల రాజీనామా!
Add ap7am to your home Screen

రాజీనామా చేస్తారా? చస్తారా?... ఉగ్రవాదుల ట్వీట్ తో నాలుగు రోజుల్లోనే 40 మంది పోలీసుల రాజీనామా!

  • పోలీసులకు ఉగ్రవాదుల హెచ్చరిక
  • కశ్మీర్ లో 40 వేల మంది ఎస్పీఓలు
  • రిజైన్ చేసిన వారి సంఖ్య చాలా స్వల్పమన్న సీఎస్
ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఇంటికి పరిమితం కాకుంటే మరణం తప్పదంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ట్వీట్ చేసిన తరువాత, నాలుగు రోజుల వ్యవధిలో 40 మంది పోలీసులు రిజైన్ చేసినట్టు తెలుస్తోంది. కాశ్మీరు లోయలో 30 వేల మందికి పైగా ఎస్పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు) ఉన్నారని, ఆ సంఖ్యతో పోలిస్తే, రాజీనామాలు సమర్పించిన వారి సంఖ్య నామమాత్రమేనని జమ్ము కశ్మీర్ చీఫ్ సెక్రెటరీ బీవీఆర్ సుబ్రమణియమ్ వ్యాఖ్యానించారు.

కశ్మీర్ లోయలో తమకు దొరికిన పోలీసు అధికారులను ఉగ్రవాదులు హత్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారంలో ముగ్గురు పోలీసులను వారి ఇళ్ల నుంచి కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు వారిపై బులెల్ల వర్షం కురిపించి హతమార్చారు. ఆపై సోషల్ మీడియాలో పోలీసులు రాజీనామా చేస్తున్న వీడియోలను ఉగ్రవాదులు వైరల్ చేయగా, ప్రభుత్వ వర్గాలు ఖండించాయి.
Jammu And Kashmir
Police
SPO
Resign

More Telugu News