అత్యాచారం కేసులో మైనర్ల సమ్మతిని అంగీకారంగా పరిగణించడం సాధ్యపడదు: మహారాష్ట్ర కోర్టు
- 2015 అక్టోబరు 2న బాలికపై అత్యాచారం
- నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ జైలు శిక్ష, జరిమానా
- నిందితుడు దురుద్దేశంతోనే బాధితురాలి ఇంట్లోకెళ్లాడన్న జడ్జి
మైనర్ బాలిక అత్యాచారం కేసులో బాలిక తెలిపే సమ్మతికి చట్టం దృష్టిలో విలువ లేదని ఈ సందర్భంగా థానే జిల్లా జడ్జి పీపీ జాదవ్ వ్యాఖ్యానించారు. బాధితురాలి వయసును పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఆమె అంగీకారాన్ని చట్టం దృష్టిలో అంగీకారంగా పరిగణించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
ఇక, ఈ కేసులో నిందితుడు దురుద్దేశంతోనే బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడని, ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని స్పష్టంగా తెలుస్తోందని న్యాయమూర్తి పీపీ జాదవ్ అన్నారు. కాగా, మహారాష్ట్రలోని థానేకు సమీపంలోని కాజువాడిలో 2015 అక్టోబరు 2న ఆ బాలికపై అత్యాచారం జరిగింది. అంతకుముందు కూడా ఆ బాలికతో నిందితుడు లైంగిక కార్యకలాపాలు సాగించాడు.