సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రభుదేవా సరసన మరోసారి తమన్నా 
  • 'ఒక్క క్షణం' దర్శకుడితో రవితేజ ప్రాజక్ట్ 
  • శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నాని?
*  తమన్నా మరోసారి ప్రభుదేవాతో జోడీ కడుతోంది. ఆమధ్య ఇద్దరూ కలసి 'దేవి' సినిమాలో నటించారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తున్నారు. ఇందులో కూడా వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. దీనికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.  
*  ఆమధ్య 'ఒక్క క్షణం' చిత్రాన్ని రూపొందించిన వీఐ ఆనంద్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇందులో రవితేజ హీరోగా నటిస్తాడని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి జరుగుతుంది.
*  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బ్రహ్మోత్సవం' చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయనున్నాడు. ఇందులో శర్వానంద్ హీరోగా నటిస్తాడంటూ వార్తలొచ్చాయి. అయితే, అది వాస్తవం కాదని, ఇందులో నాని నటిస్తున్నాడనేది తాజా సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
Thamanna
Raviteja
Nani

More Telugu News