నవాజ్ షరీఫ్ ను విడుదల చేయండి.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం!
- షరీఫ్, ఆయన కుమార్తె మరియంలను విడుదల చేయాలన్న ఇస్లామాబాద్ హైకోర్టు
- వీరు చట్టాలను ఉల్లంఘించలేదన్న కోర్టు
- అవినీతి డబ్బుతో నివాసాలను కొన్నారనడానికి సాక్ష్యాలు లేవు
అవెన్ ఫీల్డ్ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన కేసును హైకోర్టు రద్దు చేసింది. చట్టాలను వీరు ఉల్లంఘించలేదని, అవినీతి డబ్బుతో విలాసవంతమైన నివాసాలను కొన్నారనడానికి సరైన సాక్ష్యాధారాలు కూడా లేవని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు షరీఫ్ కు 11 ఏళ్లు, మరియంకు 8 ఏళ్ల శిక్షను విధించిన సంగతి తెలిసిందే.