'సామి స్క్వేర్' సెన్సార్ పూర్తి .. రిలీజ్ కి అంతా సిద్ధం
- హరి దర్శకత్వంలో 'సామి స్క్వేర్'
- సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యు సర్టిఫికెట్
- ఈ నెల 21వ తేదీన విడుదల
ఈ సినిమాలో విక్రమ్ సరసన ఒక కథానాయికగా కీర్తి సురేశ్ .. మరో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, క్లీన్ యు సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. బాబీసింహా విలన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.