ప్రతి సినిమాకి నేను భయపడుతూనే వుంటాను: దర్శకుడు మారుతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రతి సినిమాకి నేను భయపడుతూనే వుంటాను: దర్శకుడు మారుతి

  • ఇది కోట్ల రూపాయల వ్యవహారం
  • ఎవరూ ఎలాంటి రిస్కులు చేయరు
  • ఈ సినిమాపోతే ఇంకో సినిమా ఇవ్వరు 
విభిన్న చిత్రాల దర్శకుడిగా మారుతి మంచి మార్కులను సంపాదించుకున్నాడు. అందువలన ఆయన నుంచి ఒక సినిమా వస్తుందీ అంటే అంతా ఆసక్తిని చూపుతుంటారు. అలాంటి మారుతి తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నాడు. "సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండటం కష్టం .. ఎంతోమంది మహానుభావులు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారు .. నేనెంత?


అందువలన రేపటి రోజున దర్శకుడిగా నాకు అవకాశాలు లేకపోయినా, నేను ఏం చేయాలనే విషయంలో నాకు ఒక క్లారిటీ వుంది. ఇక్కడి పరిస్థితుల కారణంగానే నేను ప్రతి సినిమాకి భయపడిపోతుంటాను. ఎందుకంటే ఈ సినిమాపోతే ఎవరూ నెక్స్ట్ మూవీ ఇవ్వరు. సినిమా హిట్ అయితే ఒక ఐదారు సినిమాల అడ్వాన్సులు కనిపిస్తాయి. ఈ సినిమాపోయినా ఫరవాలేదు ... ఆ తరువాత లైన్లో ఆ ప్రొడ్యూసర్ వున్నాడు .. ఈ ప్రొడ్యూసర్ వున్నాడు అనుకుంటాము. ఈ సినిమా పోయిందనుకోండి .. వాళ్లంతా 'తరువాత చేద్దామమ్మా' అంటారు. ఇది కోట్ల రూపాయలకి సంబంధించిన వ్యవహారం కావడం వలన ఎవరూ రిస్క్ చేయరు' అని చెప్పుకొచ్చాడు.   
maruthi

More Telugu News