'పరువు హత్య' అనే పదంపై మండి పడుతున్న విద్యావేత్తలు!
- దారుణ హత్యలను పరువు హత్యలంటూ గౌరవంగా పిలుస్తారా?
- మతవాద, కులవాద శక్తులే వీటిని పరువు హత్యలని పిలుస్తాయి
- వేళ్లూనుకున్న కుల వ్యవస్థకు పరువు హత్యలు ఒక నిదర్శనం
మతవాద, కులవాద శక్తులే ఇలాంటి హత్యలను పరువు హత్యలని పిలుస్తాయని... కుల వ్యవస్థ ఈ సమాజంలో ఎంతలా వేళ్లూనుకుందో చెప్పడానికి ప్రణయ్ హత్య ఒక నిదర్శనమని హెచ్సీయూ ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి అన్నారు. ప్రణయ్ ది పరువు హత్య కాదని, పరువు తీసే హత్య అని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్ విమర్శించారు.
దళితులపై జరుగుతున్న అరాచకాల పట్ల సమాజంలో ఏమాత్రం సానుభూతి, సామాజిక స్పందన లేదనే విషయాన్ని పరువు హత్య అనే పదం సూచిస్తుందని దళిత కార్యకర్తలు యెగ్గోని జయరాజ్, దునా అంబేడ్కర్ లు చెప్పారు. ప్రణయ్ ను చంపింది కుల దురహంకారమేనని వారు మండిపడ్డారు.