ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న మారుతీరావు.. ‘మమ్మల్ని వదిలేయండ’ని ప్రాధేయపడ్డ అమృత!
- అమృతను బెదిరించిన మారుతీరావు
- ఆస్తి ఇవ్వబోనని బెదిరింపు
- అయినా లొంగకపోవడంతో దారుణ హత్య
ఎంతగా బ్రతిమాలినా తన తండ్రి ప్రణయ్ ను కనికరించలేదని అమృత తెలిపింది. తాను ఎక్కడికి వెళ్లినా ఆయనకు క్షణాల్లో తెలిసిపోయేదని వెల్లడించింది. కాగా ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించి అమృత తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.